తెలుగుదేశం పార్టీ అధినేేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో మనస్తాపానికి గురయి 23మంది మృతిచెందినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తట్టుకోలేక ఇప్పటివరకు 23 మంది మరణించారని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.ఈ మరణాలు బాధాకరమని... తమవారిని కోల్పోయిన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. టిడిపి శ్రేణులు, చంద్రబాబు అభిమానులు భావోద్వేగానికి గురికావద్దని... సంయమనం పాటించాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. 

స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో అసలు స్కాం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని... అయినా కుట్ర పన్ని టిడిపి అధినేతను అరెస్ట్ చేసారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసారని... గొప్ప నాయకుడిపై వైసిపి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించదని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబుతో జగన్ రెడ్డి సర్కార్ వ్యవహరించి తీరు ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఈ రాక్షస పాలనను అంతంచేసి జగన్ రెడ్డికి తగిన బుద్ది చెప్పడం ఖామయని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

Read More మాతో టచ్ లో టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు... చంద్రబాబు పని అయిపోయినట్లే..: కేఏ పాల్ (వీడియో)

చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు టిడిపి శ్రేణులను ఎంతగానో బాధించాయని అచ్చెన్నాయుడు అన్నారు. తీవ్ర మానసిక క్షోభతో గుండెపోటుకు గురయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇలా ఎవరు భావోద్వేగానికి గురికావద్దని... అంతిమంగా గెలిచేది ధర్మమే అని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటకు వస్తారని అచ్చెన్నాయుడు అన్నారు.