2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు: విజయవాడ జయహో బీసీ సభలో జగన్
వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు వైసీపీ విజయం సాధిస్తుందని ప్రచారం చేయాలని ఏసీ సీఎం వైఎస్ జగన్ ఆ పార్టీకి చెందిన బీసీ ప్రజా ప్రతినిధులను కోరారు.
విజయవాడ:2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలని ప్రజలకు చెప్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీ ప్రజా ప్రతినిధులను కోరారు.విజయవాడలో బుధవారంనాడు నిర్వహించిన జయహో బీసీ మహాసభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మరో 18 నెలలో యుద్ధం జరగబోతోందని చెప్పాలన్నారు. నిజాయితీకి, వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పాలన్నారు. పామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం జరగనుందని చెప్పాలని సీఎం కోరారు.
also read:2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు: విజయవాడ జయహో బీసీ సభలో జగన్
2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కంటే మించిన గెలుపు సాధించనున్నామని చెప్పాలని ఆయన కోరారు.2024 ఎన్నికల్లో మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదన్నారు. మాటపై నిలబడే నాయకత్వానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచే నాయకత్వానికి మధ్య యుద్ధం జరుగుతుందని ప్రజలకు వివరించాలని జగన్ కోరారు.సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం జరుగనుందన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తుకు రాదన్నారు. కానీ తమ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాలను వివరించాలన్నారు.
ఇక బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి 50 ఇళ్లకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం జగన్ బీసీ ప్రజా ప్రతినిధులను కోరారు.చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, దుష్ట చతుష్టయం ఏ వర్గానికి ప్రతినిధులో ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు. మీ ఇంట్లో జగన్ కు తోడుగా ఉండాలని ప్రజలను కోరాలన్నారు. మీ ఇంట్లో మంచి జరగకపోతే జగన్ కు తోడుగా ఉండొద్దని జగన్ చెప్పారని ప్రజలను కోరాలని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లలో గెలిచి తీరాలని సీఎం జగన్ కోరారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరి చొప్పున బాధ్యత తీసుకొని వైసీపీ సర్కార్ చేసిన మేలు గురించి వివరించాలన్నారు.పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల్లో కేసులు వేస్తారని టీడీపీ నేతలు కేసులు వేశారన్నారు. కానీ పేదలకు ఇంగ్లీష్ భోధన వద్దని న్యాయస్థానాలను ఆశ్రయించారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే అరిచి గీ పెడుతున్నారని టీడీపీపై జగన్ విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం మానవతావాదానికి ప్రతీక అని ఆయన చెప్పారు.చంద్రబాబు,టీడీపీ బీసీలను మూడున్నర దశాబ్దాలుగా ఉపయోగించుకొని వాడుకుందని జగన్ విమర్శించారు. బీసీల బాధను టీడీపీ అర్ధం చేసుకోలేదన్నారు. బీసీలు శాశ్వతంగా పేదరికంలో ఉండాలని టీడీపీ ప్రయత్నించిందన్నారు. కానీ తమ పార్టీ మాత్రం బీసీలను శాశ్వతంగా పేదరికం నుండి బయటపడేసే ప్రయత్నం చేసినట్టుగా జగన్ వివరించారు.ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే రాష్ట్రం శ్రీలం అవుతుందని చెబుతున్న టీడీపీని పేదల శత్రువు అని ప్రచారం చేయాలని జగన్ కోరారు. రైతులు, అవ్వా, తాతలు, అక్కా ,చెల్లెళ్లకు, పేదలకు టీడీపీ శతృవులని చెప్పాలన్నారు.