ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారంతో ముగిసింది. తొలివిడతలో మొత్తం 1315 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా... వాటిలో కొన్ని పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారంతో ముగిసింది. తొలివిడతలో మొత్తం 1315 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా... వాటిలో కొన్ని పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.
ఏకగ్రీవాల కోసం నామినేషన్ల ఉపసంహరణపై వైసీపీ నేతలు దృష్టి పెట్టగా... అభ్యర్థుల్ని ఎలాగైనా బరిలో ఉంచేలా చూడాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం కొలిక్కి రావటంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. స్ట్రాంగ్ రూంలో ఉన్న బ్యాలెట్ బాక్సులను పంచాయితీ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు.
Also Read:ఏకగ్రీవాలపై రగడ.. పార్లమెంట్, అసెంబ్లీల్లో ఉంటాయా: నిమ్మగడ్డ వ్యాఖ్యలు
బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి భారీ భద్రత నడుమ కౌంటింగ్ సెంటర్లకు తరలించనున్నారు. ఇప్పటి వరకు ఈసీ అందించిన సమాచారం ప్రకారం... ఏ ఏ జిల్లాల్లో ఎన్ని ఏకగ్రీవాలు జరిగాయో ఒకసారి చూస్తే..
చిత్తూరు జిల్లా- 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం
గుంటూరు జిల్లా- 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం
కర్నూలు జిల్లా- 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం
వైఎస్‌ఆర్ జిల్లా- 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం
పశ్చిమ గోదావరి జిల్లా- 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం
శ్రీకాకుళం జిల్లా- 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం
విశాఖ జిల్లా- 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం
తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం
కృష్ణా జిల్లా- 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం
ప్రకాశం జిల్లా- 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం
నెల్లూరు జిల్లా- 163 పంచాయతీలకు 14 ఏకగ్రీవం
అనంతపురం జిల్లా- 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం
