ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో 18 వీధి కుక్కలను విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేపింది. జంతు ప్రేమికుల ఫిర్యాదుతో గ్రామ కార్యదర్శి, సర్పంచ్‌పై కేసు ఫైల్ చేశారు. 

ఏలూరు: ఏలూరు జిల్లాలో 18 కుక్కలకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉంగటూరు మండలం చేబ్రోలులో ఈ ఘటన జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా కుక్కలకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తిని వీరబాబుగా గుర్తించారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్ భర్తలు సంయుక్తంగా తనకు ఈ ఆదేశాలు ఇచ్చారని, ఆ కుక్కలను చంపాలని ఆదేశించడంతో తాను విషపు ఇంజక్షన్ ఇచ్చినట్టు వీరబాబు తెలిపారు.

ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆందోళన తెలిపారు. వీరబాబును పోలీసులకు అప్పగించారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శిపై ఫిర్యాదు చేశారు. జంతు సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.

Also Read: హృదయవిదారక ఘటన.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి.. అక్క కళ్లముందే భయంకరంగా..

సంబంధిత చట్టాల కింద పోలీసులు చేబ్రోలు గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామ సర్పంచ్ పై కేసు నమోదు చేశారు.