తెలంగాణలోని వరంగల్, సూర్యాపేటల్లో ర్యాగింగ్ కలకలం సద్దుమణిగిందనుకొంటే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగవిప్పుతోంది. జెఎన్టియు విజయనగరం క్యాంపస్ విద్యార్థి  సోషల్ మీడియా వేదికగా తన గోడు వెళ్లబోతుకుంటే.. అనంతపురంలో 18 మంది ఇంజనీరింగ్ విద్యార్తుల్ని సస్పెండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ : ఉన్నత విద్యా వేదికలైన యూనివర్సిటీలను ఇంకా
Raging భూతం వెంటాడుతూనే ఉంది. వర్సిటీల్లో, కాలేజీల్లో, హాస్టళ్లలో ర్యాగింగ్పై ban విధించినా.. కొన్నిచోట్ల ఇంకా ర్యాగింగ్ కొనసాగడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా, Anantapur, Kakinadaల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. 

తాజాగా JNTU Vizianagaram Campus విద్యార్థి Social media వేదికగా ఈ ర్యాంగింగ్ కు సంబంధించి.. తన గోడు వెళ్లబోసుకున్నాడు. సోషల్ మీడియాలో అతనేం రాసుకొచ్చాడంటే.. ‘నా పేరు శ్రీనివాస్.. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా హాస్టల్ లో ర్యాగింగ్ తీవ్ర స్థాయిలో ఉంది..’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నిరూపించడానికి కనీసం కాలేజీలో సీసీ కెమెరాలు లేవు. మా క్యాంపస్లో కి సీనియర్లు వచ్చినా వార్డెన్లు స్పందించడం లేదు’ అని వాపోయాడు. 

ఇంతటిలో అయిపోలేదు.. ఇంకా వారి ఆగడాల గురించి రాసుకొస్తూ ‘కాలేజీ పూర్తికాగానే సీనియర్లు మా వద్దకు వస్తున్నారు. క్లాస్ అయిన 30 నిమిషాల తర్వాత వచ్చి.. రాత్రి వరకు ఇక్కడే ఉండి ఇబ్బంది పెడుతున్నారు. పాటలు పాడమంటారు. డాన్స్ చేయమంటారు, చికెన్, చేపలు మెస్ నుంచి తీసుకురావాలని ఒత్తిడి తెస్తున్నారు. తెచ్చే వరకు ఊరుకోరు..’ అని ఇలా రకరకాలుగా రాగింగ్ చేస్తున్నారని.. ‘అలాంటప్పుడు మేం సెమిస్టర్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి.. రోజువారి క్లాసులను ఎలా ఎదుర్కోవాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతేకాదు ‘ఈ విషయంలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.పైగా లెక్చరర్ లకు ఫిర్యాదు చేస్తే మా పేర్లను సీనియర్లకు చెబుతున్నారు’ అంటూ గోడు వెళ్లబోసుకున్నాడు. ‘మాకు ఈ ర్యాగింగ్ వద్దు. దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు.

ఇదిలా ఉండగా, అనంతపురం జేఎన్టీయూ లో కూడా ర్యాగింగ్ భూతం కలకలం రేపుతోంది. ర్యాగింగ్ ఆరోపణలతో 18 మంది ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. జూనియర్ల ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్లను సీనియర్ విద్యార్థులు రాత్రివేళ సినిమాలకు తీసుకెళ్లడంతో పాటు.. గదిలోకి పిలిపించి నగ్నంగా డ్యాన్స్ లు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాలకు రాగా యాజమాన్యమే తగిన చర్యలు తీసుకుంటుందని అధ్యాపకుల కమిటీ పోలీసులకు తెలిపింది.

దీంతో పోలీసులు వసతి గృహంలోనే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై వీసీ రంగజనార్దన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ అంశంపై నేడు అధ్యాపకుల కమిటీ విచారణ చేపట్టనుంది. అనంతపురం జేఎన్టీయూ లో సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టల్ లో వేరువేరుగా ఉన్నాయి. అయినా, సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ పేరిట వికృత క్రీడ సాగిస్తున్నారు. అర్ధరాత్రివేళ జూనియర్లను సీనియర్ విద్యార్థులు హాస్టళ్లకు రప్పిస్తున్నారు. అర్థనగ్నంగా డ్యాన్సులు చేయిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. సిగరెట్లు, మద్యం తీసుకురావాలని బలవంతం చేస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి సుజాత తెలిపారు.