Asianet News TeluguAsianet News Telugu

టీటీడీలో కరోనా టెర్రర్... 170మందికి పాజిటివ్

18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, తిరుమలలో పరిస్థితులపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు.

170 TTD staff members tested corona positive
Author
Hyderabad, First Published Jul 18, 2020, 2:15 PM IST


తిరుమలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, తిరుమలలో పరిస్థితులపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు.

టీటీడీ ఈవో, అదనపు ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. శ్రీవారి దర్శనాల నిలిపివేతపై సాయంత్రవం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ సోకిన జీయర్‌ స్వాములు, అర్చకులతో పాటు ఇక మిగిలిన టీటీడీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గురువారం జరిగిన సమావేశంలో 60 ఏళ్లు నిండిన అర్చకులకి విధుల నుంచి సడలింపు ఇచ్చామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల నేపథ్యంలో ఆలయంలో స్వామి వారి దర్శనం ఆపేయాలంటూ కొందరు పేర్కొంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios