ఏపీలో కొత్తగా 15 కేసులు, ఇద్దరి మృతి: 363కి చేరిన బాధితులు, మొత్తం మరణాలు 6

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం మరో 15 పాజిటివ్ కేసులు  నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 363కి చేరింది. ఇవాళ కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరులో 2, కడప, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. 

15 new coronavirus cases recorded in Andhra Pradesh death toll reached to 6

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం మరో 15 పాజిటివ్ కేసులు  నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 363కి చేరింది. ఇవాళ కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరులో 2, కడప, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది.

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. వీరితో కలిపి రాష్ట్రంలో కోవిడ్ 19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6కి చేరింది. గురువారం చిత్తూరు జిల్లాలో ఓ కరోనా బాధితుడు డిశ్చార్జ్ అయ్యాడు. ఇతనితో కలిపి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 10కి చేరింది. 

Also Read:కరోనాపై పోరు: నెల రోజుల బిడ్డతో ఆఫీసుకి.. విశాఖ కమీషనర్‌పై ప్రశంసలు

అంతకుముందు బుధవారం రాత్రి 9గంటల నుంచి ఉదయం 9గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

217 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అన్ని కేసులు నెగటివ్‌గా వచ్చాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 348 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 90 శాతం మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారే ఉండడం గమనార్హం.

ఢిల్లీకి వెళ్లొచ్చిన 1000 మంది ప్రయాణికులతో పాటు వారితో కాంటాక్ట్‌ అయిన 2500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటివరకు 7,155 మందికి పరీక్షలు నిర్వహించగా 348 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకుని 9 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Also Read:లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయిన అర్చకులు... భారీ గ్రాంట్ ప్రకటించిన జగన్ సర్కార్

రాష్ట్రంలో కోటి 42 లక్షల కుటుంబాలకు సర్వే పూర్తి చేశారు. 6289 మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారిలో 1750 మంది స్వీయ నిర్బంధంలో ఉంచారు. రోజుకు వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios