శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నాడు ఉదయం లారీ, బస్సును  ఢీకొన్న ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.  ఈ ఘటనలో టూరిస్టు బస్సు పూర్తిగా దగ్ధమైంది. 

శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వరిశాం జంక్షన్ వద్ద అమోనియం లారీని టూరిస్ట్ బస్సు ఢీకొంది.దీంతో టూరిస్టు బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయణీకులు ఉన్నారు.