విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ నివాసముంటున్న రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేగింది. ఇక్కడ పనిచేసే 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌ భద్రతకోసం నియమించిన 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చారు. 

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రాష్ట్రంలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,093 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరుకొన్నాయి.

 గత 24 గంటల వ్యవధిలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1676 కేసులు రికార్డయ్యాయి. అనంతపురంలో 1371, చిత్తూరులో 819, గుంటూరులో 1124, కడపలో 734 కేసులు నమోదయ్యాయి.

read more  నాకు సరైన వైద్యం అందడం లేదు: కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో

కృష్ణాలో 259, కర్నూల్ లో1091, నెల్లూరులో 608, ప్రకాశంలో 242, శ్రీకాకుళంలో496, విశాఖపట్టణంలో841, విజయనగరంలో53, పశ్చిమగోదావరిలో 779 కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 65 మంది మరణించారు. తూర్పు గోదావరిలో 14 మంది, అనంతపురంలో 8మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి చొప్పున మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 55,406 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 63,771 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,20,009  మంది శాంపిల్స్ ను పరీక్షించారు. 

రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -12,358, మరణాలు 97
చిత్తూరు -9080, మరణాలు 95
తూర్పుగోదావరి -17,739, మరణాలు 148
గుంటూరు -12,816, మరణాలు 112
కడప - 6477, మరణాలు 36
కృష్ణా -6259, మరణాలు157
కర్నూల్ -14,471, మరణాలు 179
నెల్లూరు -5,753, మరణాలు 37
ప్రకాశం - 4443, మరణాలు 53
శ్రీకాకుళం -5582, మరణాలు 65
విశాఖపట్టణం-8559, మరణాలు 92
విజయనగరం -3603, మరణాలు 51
పశ్చిమగోదావరి- 10,356, మరణాలు 91