నాకు సరైన వైద్యం అందడం లేదు: కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో

నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి తనకు సరైన వైద్యం అందడం లేదని సెల్పీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే బాధితుడి ఆరోపణల్లో వాస్తవం లేదని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి

Corona patient selfie video over doctors neglegency in nizambad hospital

నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి తనకు సరైన వైద్యం అందడం లేదని సెల్పీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే బాధితుడి ఆరోపణల్లో వాస్తవం లేదని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ ఆసుపత్రిలో గత మాసంలో చోటు చేసుకొన్న ఘటనలపై  సూపరింటెండ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తాను ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చాను. అదే రోజు టెస్టులు చేస్తామని పైకి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చుకొన్నారు.  అప్పటి నుండి ఇప్పటివరకు వైద్యులను సంప్రదించేందుకు అనుమతి అడుగుతున్నానని ఆయన చెప్పారు. సిస్టర్లు వస్తున్నారు, కానీ తనకు టెస్టులు చేయలేదని ఆ  వీడియోలో ఆయన ఆరోపించారు.  నిన్న తనకు కరోనా పరీక్షలు నిర్వహించారని ఆయన చెప్పారు. 

విపరీతంగా జ్వరం వస్తోందన్నారు. ఈ విషయమై ఆయన తన బాధను వీడియోలో వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఈ విషయమై ఆసుపత్రి వైద్యులను సంప్రదిస్తే బాధితుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. షుగర్ ట్యాబ్లెట్, ఇన్సులిన్ విషయంలో బాధితుడికి , డ్యూటీ డాక్టర్ కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకొందన్నారు. దీంతో బాధితుడి  వీడియో తీసి పోస్టు చేసి ఉండొచ్చని ఆసుపత్రి సూపరింటెండ్ ప్రకటించారు.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios