గుంటూరు జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. పిడుగురాళ్ల మండలం మంచికల్లులో పోలేరమ్మ జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా తనిఖీలు చేస్తుండగా నాటు బాంబులు బయటపడ్డాయి.

వైసీపీ నేత యరపతినేని నరసింహారావు ఇంటి ముందు ప్లాస్టిక్ బకెట్‌‌లో పాతిపెట్టి ఉంచిన 15 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం వాటిని నిర్వీర్యం చేసింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.