విశాఖపట్నం:  అభం శుభం తెలియని మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. బాలిక తల్లితో కలిసే ఇంటికి వచ్చిన కీచకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. కామాంధుడి చేతిలో దాడికి గురయిన బాలిక గర్భం దాల్చడమే కాదు  ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లాలో చోటుచచేసుకుంది. 

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఓ గ్రామంతో బధిర మైనర్ బాలిక(14) తాతయ్యతో కలిసి నివసిస్తోంది. బాలిక తల్లి ఉపాది నిమిత్తం విశాఖపట్నంలో వుంటూ అప్పుడప్పుడు కూతురిని చూసేందుకు గ్రామానికి వచ్చేది. ఇలా కొద్దినెలల క్రితం ఆమెతో పాటు దల్లి సింహాచలం అనే వ్యక్తి గ్రామానికి వచ్చి బాలికను చూశాడు. ఈ క్రమంలోనే ఆ అమాయకురాలిపై కన్నేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. 

అయితే ఈ విషయం ఇటీవల బాలిక తల్లి కావడంతో బయటపడింది. మైనర్ అయిన బాలిక గర్భంతో హాస్పిటల్ కు రావడం, బిడ్డకు జన్మనివ్వడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన వారు బాలిక తల్లిని విచారించగా జరిగిన అఘాయిత్యం గురించి బయటపెట్టింది. దీంతో సింహాచలంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.