ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 139 మందికి కోవిడ్ 19 సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 8,86,557కి చేరింది.

కోవిడ్ కారణంగా నిన్న ఎటువంటి మరణం సంభవించలేదు. నిన్నటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7,142కి చేరింది.  ప్రస్తుతం ఏపీలో 1522 యాక్టివ్ కేసులు వున్నాయి.

గత 24 గంటల్లో 254 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీరితో కలిపి మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,77,893కి చేరింది. గడిచిన 24 గంటల్లో 49,483 మందికి టెస్టులు నిర్వహించారు.

వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం కరోనా నిర్ధారణా పరీక్షల సంఖ్య 1,27,39,648కి చేరుకుంది. నిన్న అనంతపురం 8, చిత్తూరు 20, తూర్పుగోదావరి 13, గుంటూరు 17, కడప 4, కృష్ణ 35, కర్నూలు 6, నెల్లూరు 5, ప్రకాశం 9, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 7, విజయనగరం 5, పశ్చిమ గోదావరిలలో 7 కేసులు నమోదయ్యాయి.