కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం వద్ద బోలు బోల్తా పడిన ఘటనలో 12 మంది ప్రయాణీకులు మృతిచెందారు. దాదాపు 40 మందితో ప్రయాణిస్తున్న బోటు ఫెర్రీ వద్ద తిరగబడింది. పవిత్ర సంగమం వద్ద హారతి చూద్దామని ప్రయాణీకులందరూ బోటెక్కారు. కొద్ది సేపటిలో హారతి చూసేందుకు ప్రయాణీకులందరూ బోటులో నుండి దిగటానికి ప్రయత్నించటంతో ప్రమాదం జరిగింది. ప్రయాణీకులందరూ బోటులో ఒక వైపుకు చేరుకోవటంతో బోటు తిరగబడింది. మృతుల్లో ఎక్కువమంది ఒంగోలుకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.

ఘటన విషయం తెలియగానే ఎన్డిఆర్ఎఫ్ బృందం నదిలోకి దిగి గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. వీరికి పోలీసులు, స్ధానికులు సహాయం అందిస్తున్నారు. ఇంకా బోటులోని 28 మందిలో 10 మందిని రక్షించినట్లు సమాచారం. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. చీకటిగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా ఉంది. టూరిజం బోటులోనే ప్రమాదం జరగటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఘటనపై మంత్రి అఖిలప్రియ విచారణకు ఆదేశించారు.