ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 116 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 8,87,836కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 116 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 8,87,836కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కరోనా కారణంగా నిన్న రాష్ట్రంలో ఏ ఒక్కరు మరణించలేదు. దీంతో శనివారం నాటికి ఏపీలో కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,153కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 1,278 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 127 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,79,405కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు 41,910 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించారు.

దీంతో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 1,31,37,872కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో అనంతపురం 3, చిత్తూరు 17, తూర్పుగోదావరి 9, గుంటూరు 13, కడప 9, కృష్ణా 24, కర్నూలు 7, నెల్లూరు 5, ప్రకాశం 1, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 13, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 11 కేసులు చొప్పున నమోదయ్యాయి.

Scroll to load tweet…