కాకినాడ జిల్లా కాజులూరు సమీపంలోని గొల్లపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఓ బాలుడి మెడకు తాడు చుట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు సమీపంలోని గొల్లపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఓ బాలుడి మెడకు తాడు చుట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని మనోజ్ చంద్రశేఖర్‌గా గుర్తించారు. ఈ చిన్నారి ఐదవ తరగతి చదువుతున్నాడు. తన చెల్లిని తీసుకొచ్చేందుకు బాలుడు సోమవారం ఇంటికి దగ్గరలో వున్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు. ఈ సమయంలో మనోజ్ లోపలికి వెళ్లి పిల్లలను తూకం వేసే ఉయ్యాల ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తూ ఉయ్యాల తాడు బాలుడి మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
