పల్నాడు జిల్లా రెంటచింతలలోని గిరిజన హాస్టల్‌లో పదో తరగతి విద్యార్ధిని గర్భవతిని చేశాడు హాస్టల్ వార్డెన్. ఈ విషయం తెలుసుకున్న వార్డెన్ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒంగోలులో అబార్షన్ చేయించాడు. 

పల్నాడు జిల్లా రెంటచింతలలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక గిరిజన హాస్టల్‌లో వుంటూ పదో తరగతి చదువుకుంటోన్న బాలికను హాస్టల్ వార్డెన్ తల్లిని చేశాడు. నిందితుడిని పెద్దలపూడి శ్రీనివాసరావుగా గుర్తించారు. విద్యార్ధినిని మాయమాటలలో లోబరుచుకుని.. గత కొంతకాలంగా ఆమెను అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న వార్డెన్ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒంగోలులో అబార్షన్ చేయించాడు. అయితే హాస్టల్‌లో విద్యార్ధిని కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి విద్యార్ధినిని సదరు వార్డెన్ మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్ధిని సంరక్షణా కేంద్రానికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ALso REad:మాచర్లలో టెన్త్ విద్యార్థిని మిస్సింగ్ ... హాస్టల్ వార్డెనే ఇంతపని చేసాడా?