ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,328 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 72 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు.

వీరితో కలిపి మృతుల సంఖ్య 1,753కి చేరుకుంది. రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,351 మంది పాజిటివ్‌గా తేలారు. ఆ తర్వాత కర్నూలు 1285, అనంతపురంలో 1112 కేసులు నమోదయ్యాయి.

Also Read:అరకు ఎమ్మెల్యే ఫాల్గుణకు కరోనా: హోం క్వారంటైన్‌లో కుటుంబ సభ్యులు

గుంటూరు 868, పశ్చిమ గోదావరి 798, నెల్లూరు 788, విశాఖపట్నం 781, చిత్తూరు 755, శ్రీకాకుళం 682, కడప 604, ప్రకాశం 366, కృష్ణా 363 కరోనా కేసులు నమోదయ్యాయి.

అలాగే గురువారం అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున మరణించారు. ఆ తర్వాత గుంటూరులో 9, చిత్తూరులో 8, కృష్ణాలో 6, నెల్లూరు 6, ప్రకాశం 6, విశాఖపట్నం 4, కడప 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 3, కర్నూలు 2, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Also Read:టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో మృతి

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 63,686  శాంపిల్స్‌ను పరీక్షించారు.. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం పరీక్షల  సంఖ్య 22,99,332కి చేరుకుంది. గత 24 గంటల్లో 8,516 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 1,12,870కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 82,166 మంది చికిత్స పొందుతున్నారు.