ఏపీకి అలర్ట్: ఒకే రోజు 1,000కి పైగా కేసులు.. గుంటూరు, చిత్తూరులో అత్యధికం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ 1000కి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి

1005 new corona cases reported in andhra pradesh ksp

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ 1000కి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

దీంతో ఇక్కడా లాక్‌డౌన్ తప్పదేమో అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,005 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,98,815కి చేరుకుంది.

కోవిడ్ కారణంగా నిన్న చిత్తూరు, కృష్ణా  జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు  కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 7,205కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,394 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 324 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,86,216కి చేరింది. నిన్న 31,142 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించారు

అధికారులు. వీటితో కలిప ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 1,49,90,039కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో అనంతపురం 36, చిత్తూరు 184, తూర్పుగోదావరి 25, గుంటూరు 225, కడప 21, కృష్ణా 135, కర్నూలు 42, నెల్లూరు 84, ప్రకాశం 35, శ్రీకాకుళం 22, విశాఖపట్నం 167, విజయనగరం 13, పశ్చిమ గోదావరిలలో 16 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios