తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రథం దగ్ధమైన ప్రాంతంలో మరోసారి కలకలం రేగింది. సంఘటనా స్థలంలో విధుల్లో పాల్గొన్న పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

విచారణాధికారి ఎస్పీ కరణం కుమార్, ఎస్పీ నయిం ఆష్మి, రాజోలు సీఐ, డ్రైవర్, రైటర్ సహా మరో ఐదుగురు ఎస్సైలకు కోవిడ్ 19 నిర్థారణ అయ్యింది. దీంతో సదరు పోలీసు అధికారులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.