చెన్నై:టెర్రరిస్టులు అన్ని మతాల్లో ఉన్నారని ఎంఎన్ఎం చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టారు.

ఈ వారం మొదట్లో నాథూరామ్ గాడ్సేపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో  కమల్‌హాసన్‌పై బీజేపీ నేతలు చెప్పులు, కోడిగుడ్లు, రాళ్లతో దాడికి దిగారు. నాథూరామ్ గాడ్సేపై చేసిన వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానని ఆయన ప్రకటించారు.

మరో వైపు ఈ వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసన్‌ నాలుక కోసేయాలని అన్నాడిఎంకె నేత, మంత్రి రాజేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాళ్ల దాడి, చెప్పుల దాడికి తాను భయపడనని తేల్చిచెప్పారు.నాథూరామ్ గాడ్సేపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.