స్త్రీ అంగాల ప్రదర్శనతో మ్యూజియం.. ఎక్కడో తెలుసా..?

By telugu news team  |  First Published Mar 24, 2021, 12:30 PM IST

అసలు మీకు వర్జీనా గురించి ఏం తెలుసు..? ఇదొక స్త్రీ జననాంగం, దీనిలో నుంచి పిల్లలు పుడతారు. సెక్స్ చేయడానికి అనువైన భాగం. ఇంతేకదా..? అయితే.. ఈ మ్యూజియంలో ఇంతకు మించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. 
 


స్త్రీ, పురుషుల జననాంగాల గురించి చిన్న వయసులోనే మనమంతా పుస్తకాల్లో చదువుకునే ఉంటాం. వాటి గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని.. చిన్నప్పుడే పాఠ్యాంశాలలో వాటిని చేరుస్తారు. అయితే.. ఇప్పుడు వాటికి సంబంధించి ఏకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేశారు.

నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. స్త్రీ జననాంగాలు, వాటిలోపలి పార్ట్స్, పురుషాంగం ఇలావాటి పనితీరు లాంటితో  ప్రత్యేకంగా లండన్ లో మ్యూజియం ఏర్పాటు చేశారు.

Latest Videos

undefined

ఇదేదో పోర్న్ సినిమాని తలపించేలా ఉంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకంటే.. కేవలం స్త్రీ జననాంగాలపై అవగాహన కలిగించేలా దీనిని ఏర్పాటు  చేయడం విశేషం. అసలు మీకు వర్జీనా గురించి ఏం తెలుసు..? ఇదొక స్త్రీ జననాంగం, దీనిలో నుంచి పిల్లలు పుడతారు. సెక్స్ చేయడానికి అనువైన భాగం. ఇంతేకదా..? అయితే.. ఈ మ్యూజియంలో ఇంతకు మించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. 

కంటికి కనిపించని లోపలి భాగాలు.. అవి ఎలా పనిచేస్తాయనే విషయాలను పూసగుచ్చినట్లు వివరిస్తారు. లండన్ లోని  కమోడాన్ మార్కెట్ లో దీనిని ఏర్పాటు చేశారు. సైన్స్ డ్యాక్యుమెంటరీలో భాగంగా  ఓ యువతి చేసిన ప్రయోగం ఇది.  వర్జీనా గురించి అందరికీ తెలిసేలా ఆమె దీనిని ఏర్పాటు చేశారు.

ఇక్కడ వర్జీనా కు సంబంధించి త్రీడీ చిత్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని వందల రకాల చిత్రాలు అక్కడ ఉన్నాయి. అందరు మహిళల వర్జీనా ఒకేలా ఉండదట. అందుకే.. అన్ని వందల రకాలను ఏర్పాటు చేశామని ఆమె చెప్పడం విశేషం. శృంగారంలో పాల్గొనే సమయంలో ఎలా స్పందిస్తుంది..? పిల్లలను కనేటప్పుడు ఎలా స్పందిస్తుంది..? పీరియడ్స్ సమయంలో ఎలా ఉందటుంది..?ఈ తేడాలను కూడా అక్కడ స్పష్టంగా తెలియజేస్తుండటం విశేషం.

అంతేకాదు.. మహిళల కండోమ్స్, సెక్స్ దాడి జరిగితే మహిళల వర్జీనాలో కలిగే గాయాలు, ఇన్ఫెక్షన్స్, సెక్స్ టాయ్స్ ఇలా ప్రతి ఒక్కటీ అక్కడ ప్రదర్శనకు ఉంచారు. కాగా.. దీనిని చూడటానికి స్థానికులు తెగ ఆసక్తిచూపిస్తుండటం గమనార్హం. 
 

click me!