Dec 4, 2019, 4:48 PM IST
ఇసుక రవాణా చేస్తున్న యజమానులతో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనానికి జిపియస్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆద్వర్యంలో మంత్రులు ,శాసన సభ్యులు ఇసుక అక్రమంగా తరలించి వేలాది కోట్లు అవీనితి చేశారని, దానికి నిదర్శనం గత ప్రభుత్వం నదీ గర్భం ఇసుకను అక్రమంగా తీసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్లు జరిమానా విధించిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం నుండి నాలుగు నెలలు వరదలు రావడంతో సుమారు 10కోట్ల టన్నులు ఇసుక మేటలు నదిలో చేరినట్లు అధికారులు అంచనా వేశారు. రాబోయే పది సంవత్సరాల వరకు ఇసుకకు ఈ రాష్ట్రంలో కోరత ఉండకపోవచ్చని మంత్రి తెలిపారు.