నోరు తెరిచి నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 24, 2024, 11:05 AM IST

చాలా మందికి నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటుంది. కొంతమందికి అయితే నోరుతెరిచి నిద్రపోతున్నామన్న సంగతి కూడా తెలియదు. కానీ ఇలా నోరు తెరిచి నిద్రపోయే అలవాటు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 

మన ఆరోగ్యం బాగుండాలంటే కంటినిండా నిద్రపోవాలి. నిద్ర మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతుంది. అందుకే రోజుకు 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. అయితే కొంతమందికి నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటుంది. వీళ్లు ముక్కు నుంచి కాకుండా.. నోటి ద్వారే శ్వాసను తీసుకుంటుంటారు. అయితే ఇలా నోరు తెరిచి నిద్రపోయే వారు శ్వాస సరిగ్గా తీసుకోరని డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఇలా నోరు తెరిచి నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


దంతాల ఆరోగ్యం

నోరు తెరిచి నిద్రపోయే వారు ముక్కు నుంచి శ్వాస తీసుకోనే తీసుకోరు. ఓన్లీ నోటి నుంచి మాత్రమే శ్వాసను తీసుకుంటారు. కానీ దీనివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది మీ దంతాల ఆరోగ్యానికి మంచిదికాదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గురక

గురకకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఈ గురక వల్ల వారి పక్కన పడుకున్న వారికి నిద్రే ఉండదు. కానీ గురక పెట్టే వారు మాత్రం బాగా నిద్రపోతారు. అసలు విషయానికొస్తే నోరు తెరిచి నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల కూడా గురక వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos



దగ్గు

దగ్గు ఎన్నో కారణాల వల్ల వస్తుంటుంది. ఈ దగ్గు ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల సిరప్ లు, ట్యాబ్లెట్లను వాడుతుంటారు. అయితే కొంతమందికి చాలా రోజుల వరకు దగ్గు వస్తూనే ఉంటుంది. అయితే నోరు తెరిచి నిద్రపోయే వారికి ఎఫ్పుడూ దగ్గు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

sleeping

చెడు శ్వాస

చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల నలుగురిలో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా మందికి నోటి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుందో కూడా తెలియదు. నిజానికి ఇలా నోటిలో నుంచి దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో నోరు తెరిచి నిద్రపోవడం ఒకటని నిపుణులు చెబుతున్నారు. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల నోటి నుంచి శ్వాస తీసుకుంటారు. దీంతో నోటి నుంచి దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

డార్క్ సర్కిల్స్

డార్క్ సర్కిల్స్ వల్ల ముఖం అందవిహీనంగా, ఏదో జబ్బున్న వారిలా కనిపిస్తారు. ఒత్తిడికి గురికావడం, సరిగ్గా నిద్రపోకపోవడం, డిజిటల్ స్క్రీన్ ను ఎక్కువగా చూడటం వంటి వివిధ కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.

ఇవి మాత్రమే కాదు.. రాత్రిపూట నోరు తెరిచి నిద్రపోయేవారికి కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. జలుబు లేదా ముక్కుకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు నోటి నుంచే శ్వాస తీసుకుంటుంటారు. ఇది అలాగే అలవాటుగా మారిపోతుంది. కానీ దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో చూశారు కదా..
 

click me!