ఒక్క రోజులో ఇండియా 640 మిలియన్ల ఓట్లు లెక్కించింది..అమెరికన్ ఎలక్షన్ సిస్టమ్ ని దుమ్మెత్తిపోసిన ఎలాన్ మస్క్

First Published | Nov 24, 2024, 11:06 AM IST

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. టెస్లా ప్రయోగాలతో పాటు అనేక విషయాలని ట్వీట్ చేస్తుంటారు. తాజాగా మస్క్ భారత ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. టెస్లా ప్రయోగాలతో పాటు అనేక విషయాలని ట్వీట్ చేస్తుంటారు. తాజాగా మస్క్ భారత ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అమెరికా ఎన్నికల వ్యవస్థ కంటే భారత ఎన్నికల వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉందని చెప్పేలా మస్క్ పోస్ట్ చేశాడు. 

అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యాయి. డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించారు. కానీ కీలకమైన కాలిఫోర్నియా రాష్ట్రంలో మాత్రం ఇంకా ఎన్నికల లెక్కింపు పూర్తి కాలేదు. దీనిని తప్పు పడుతూ ఎలాన్ మస్క్ పోస్ట్ చేయడం విశేషం. ఓ నెటిజన్ ట్విట్టర్ లో.. ఇండియా ఒక్క రోజులో 640 మిలియన్ల ఓట్లు ఎలా లెక్కించింది అనే ఆర్టికల్ పై కామెంట్ పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల ప్రధాన లక్ష్యం మోసం చేయడం కాదు అని కామెంట్ చేశాడు. డోనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.. కానీ ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 


దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఇండియా ఒక్క రోజులో 640 మిలియన్ల ఓట్లు లెక్కించింది. కానీ కాలిఫోర్నియాలో ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు అంటూ మస్క్ అమెరికా ఎన్నికల వ్యవస్థపై సెటైర్లు వేశారు. మరో నెటిజన్ ఇండియాకి ఒక్క రోజులో లెక్కించిన ఓట్లు 640 మిలియన్ల - కాలిఫోర్నియాలో 15 మిలియన్ల ఓట్లు లెక్కించడానికి పట్టిన సమయం 18 రోజులు (ఇంకా పూర్తి కాలేదు) అంటూ సెటైర్ వేశారు. 

గత రెండు మూడు వారాలుగా కాలిఫోర్నియాలో 3 లక్షల బ్యాలెట్స్ లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం. కాబట్టి అక్కడ ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతోంది అని కొందరు చెబుతున్నారు. నవంబర్ 5న జరిగిన యుఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో దాదాపు 16 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియ వల్ల ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. 
 

Latest Videos

click me!