Oct 25, 2022, 12:07 PM IST
నిర్మల్ : తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లపై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో అసలు కుంభకోణాలు, భూకబ్జాలు లేవని... లంగలు, గూండాలు, వేట కొడవళ్లు పట్టుకుతిరిగే రాయలసీమ ప్యాక్షనిస్టులు లేరుకాబట్టే సుపరిపాలన అందిస్తున్నామని కేసీఆర్ అంటున్నాడని గుర్తుచేసారు. కానీ కానీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం జరిగిందే ఈ పాలనలో... దీంట్లోనే రూ. 70వేల కోట్లు దోచుకున్నారు... అసలు కుంభకోణాల ఫాదరే కేసీఆర్ అని ఆరోపించారు. అలాంటి ఈయనా కుంభకోణాల గురించి మాట్లాడేదంటూ షర్మిల మండిపడ్డారు. స్కూటర్ నడిపే కేసీఆర్ ఇప్పుడు అక్రమ సంపాదనతో విమానాలు, హెలికాప్టర్లు కొనే స్థాయికి ఎదిగాడని షర్మిల పేర్కొన్నారు. సామాన్యులనే కాదు ప్రశ్నించిన జర్నలిస్టులపై కేసులు పెడుతూ బయపెడుతున్నారని అన్నారు. ఇది తెలంగాణ కాదు ప్రజాస్వామ్యం కాదు... ఇది వాస్తవానికి అప్ఘానిస్తాన్.. వీళ్లు తాలిబాన్లు అంటూ షర్మిల తీవ్రవ్యాఖ్యలు చేసారు.