Oct 20, 2022, 1:34 PM IST
నిజామాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని పొగుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ హయాంలో నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో 550 ఎకరాల సువిశాలమైన క్యాంపస్ తో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటుచేసారని గుర్తుచేసారు. ఇలా బ్రహ్మాండంగా వున్న యూనివర్సిటీని కేసీఆర్ భ్రష్టుపట్టించాడని ఆరోపించారు. యూనివర్సిటీలో విద్యార్థులకు సరయిన తిండి పెట్టడం లేదు... కనీసం బాత్రూంలు కూడా సరిగ్గా లేవని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. ఇక తెలంగాణ యూనివర్సిటీ విసిపై షర్మిల సంచలన ఆరోపణలు చేసారు. మంత్రి కేటీఆర్ కు రూ.3 కోట్లు లంచమిచ్చి వైస్ చాన్సలర్ పదవిని కొనుక్కున్న విసి ఉద్యోగాలను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. అంతేకాదు అమ్మాయిల క్యాంపస్ కు వెళ్లి డబ్బులు చల్లుతూ డ్యాన్సులు చేసిన ఈ విసిపై చర్యలు తీసుకోవడం లేదని... ఇలా ఏడ్చింది మన రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన అంటూ షర్మిల మండిపడ్డారు.