Jun 9, 2022, 3:22 PM IST
ఖమ్మం: మొన్న వైఎస్ జగన్, నిన్నా, ఇవాళ వైఎస్ షర్మిల పార్టీ శ్రేణులు, ప్రజల కోరికమేరకు ట్రాక్టర్ నడిపారు. ఏపీ సీఎం జగన్ తండ్రి పేరిట ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాక్టర్ స్టీరింగ్ పడితే అదే బాటలో నడిచారు వైఎస్ షర్మిల. సోదరుడిలాగే తండ్రి పేరిట తెలంగాణలో పార్టీపెట్టి వైఎస్ షర్మిల ఆయనలాగే పాదయాత్రతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇలా అన్ని విషయాల్లోనూ సోదరుడి బాటలోనే నడుస్తున్న షర్మిల తాజాగా జగన్ ట్రాక్టర్ నడిపిన మరునాడే తానుకూడా ట్రాక్టర్ నడిపారు. ఇవాళ మరోసారి ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి వైఎస్సా టిపి శ్రేణులతో పాటు పాదయాత్రలో పాల్గొన్నవారిలో ఉత్సాహం నింపారు వైఎస్ షర్మిల.