Mar 23, 2021, 2:21 PM IST
సంగారెడ్డి : వాహనాల తనిఖీ పేరిట సదాశివపేట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు ఓ బొలేరో వాహన డ్రైవర్ వాజిద్ పై కర్కశంగా వ్యవహరించారు. రోడ్డుపైన పడేసి ముగ్గురు, నలుగురు పోలీసులు అతన్ని చుట్టుముట్టి బూటుకాలితో తంతూ, లాఠీలతో చితకబాదారు. అందరూ చూస్తుండగానే యువకుడిని బండబూతులు తిట్టి, చితకబాదడమే కాకుండా చివరకు బాధిత యువకుడిపైనే కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో యువకుని బంధువులు, స్నేహితులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.