Oct 20, 2022, 3:57 PM IST
సిరిసిల్ల : ఓ కాంట్రాక్టర్ నుండి రూ.30 వేలు లంచం తీసుకుంటూ వేములవాడ మున్సిపల్ కమీషనర్ శ్యాంసుందర్ ఏసిబికి పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కమీషనర్ కు వేములవాడ మున్సిపల్ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. మున్సిపల్ శాఖలో మంచి అనుభవం కలిగిన కమీషనర్ పై కక్ష పెంచుకున్న కొందరు కావాలనే ఏసిబికి పట్టించారని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి మున్సిపల్ కమీషనర్ కు న్యాయం జరిగేలా చూడాలని ఉన్నతాధికారులను వేములవాడ మున్సిపల్ ఉద్యోగులు కోరారు. ఏదేమైనా లంచం తీసుకుంటూ పట్టబడిన అధికారి కోసం ఉద్యోగులు ఆందోళన చేపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.