Aug 21, 2020, 12:59 PM IST
భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లా వర్థన్నపేటలోని చెరువుకు గండి పడింది. దీంతో చెరువుకట్ట మధ్యలోకి తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదనీరు భారీగా చేరడంతోనే ఈ ప్రమాదం జరిగింది. చెరువులోని నీరు గ్రామంలోకి చేరుతోంది. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లోకి భారీగా నీరు చేరాయి.