అనంతపురంలో ఉద్రిక్తత... పోలీసుల అదుపులో జేసీ పవన్

Nov 25, 2020, 1:42 PM IST

ఏపీలో మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని పవన్ ను అదుపులోని తీసుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.