Jan 11, 2023, 11:38 AM IST
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పంచాయితీలకు కేటాయించిన నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ దారిమల్లించారని రిటైర్డ్ ఐపిఎస్, బిజెపి నాయకులు కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ఇలా తమ నిధులను కొట్టేసారంటూ కొందరు సర్పంచులు హుజురాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేసారని... అయితే వారి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. నిజానికి పోలీసులు 120B క్రిమినల్ కుట్ర, 379 దొంగతనం, 403, 406, 420, 465,468 IPC సెక్షన్లతో పాటు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేయాల్సిందని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.