పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న విడుదల కానుంది. అల్లు అర్జున్ చిత్రానికి US బాక్స్ ఆఫీస్ వద్ద ప్రీ-సేల్స్ అద్భుతంగా ఉన్నాయి.కాగా, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల రికార్డ్స్ పై పుష్ప 2 కన్నేసింది. అత్యధిక అడ్వాన్స్ సేల్స్ సాధించిన చిత్రంగా ఉన్న కేజీఎఫ్: చాప్టర్ 2, జవాన్‌ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పుష్ప 2
యష్ నటించిన చిత్రం కేజీఎఫ్: చాప్టర్ 2 మొదటి రోజు బుకింగ్స్ తోనే రూ.40 కోట్లకు పైగా వసూలు చేసింది, అనంతరం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రూ.36 కోట్లతో రెండో స్థానంలో ఉంది. పుష్ప 2: ది రూల్ ఈ రెండు చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ఎలాంటి పోటీ లేకుండా సోలోగా విడుదల చేస్తున్నారు. ఇది పుష్ప 2 చిత్రానికి కలిసొచ్చే అంశం. ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయి.
విక్కీ కౌశల్ నటించిన మ్యాడక్ ఫిల్మ్స్ చావా డిసెంబర్ 6న విడుదల కానుంది. అయితే, ఈ చిత్ర నిర్మాతలు మూవీ విడుదల వాయిదా వేశారు. కంగువ, అమరన్ ,భూల్ భులయ్యా 3 , సింగం అగైన్ సహా ఇతర చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద తమ రన్ పూర్తి చేసుకున్నాయి, పుష్ప 2 కోసం థియేటర్స్ ఖాళీగా ఎదురు చూస్తున్నాయి.
ఉత్తర అమెరికాలో, ఈ చిత్రం ఫస్ట్ డే ప్రీ-సేల్స్‌లో $1.80 మిలియన్లకు పైగా వసూలు చేసింది, ఇంకా విడుదలకు సమయం ఉంది. మొత్తం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌ను $2 మిలియన్లకు పైగా చేసిందని ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నీల్క్ తెలిపింది.
పుష్ప 2 శ్రీలీల
వాస్తవానికి, ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ $2 మిలియన్లను మించిపోయాయి. అత్యంత వేగంగా ఈ మార్క్ ని చేరుకున్న ఇండియన్ మూవీగా పుష్ప 2 ఉంది. విడుదలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.
పుష్ప 2 కొన్నిభారీ బాక్స్ ఆఫీస్ రికార్డులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుకూలమైన వర్డ్-ఆఫ్-మౌత్ వస్తే, పుష్ప 2 వసూళ్లకు ఆకాశమే హద్దు!ఒక్క హిందీ వెర్షన్ రూ. 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.
అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చిత్రంలో రష్మిక మందన్న నటించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మించాయి. పుష్ప 2: ది రూల్ ఆరు భాషల్లో విడుదల కానుందని సమాచారం..