రాముడి లాంటి హిందూ దేవుళ్లను నమ్మొద్దు: స్వేరోస్ సభ్యుల ప్రతిజ్ఞ

Mar 15, 2021, 6:13 PM IST

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దులికట్ట, జులాపల్లి మండలం వడుకపూర్ గ్రామాల సరిహద్దులో బౌద్ధ స్తూపం వద్ద స్వేరోస్ సభ్యులు చేసిన ప్రతిజ్ఞ పై బిజెపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  హిందు దేవుళ్ళు రాముడు,శివుడు, గణేష్ ఎవరు లేరని... వారిని నమ్మవద్దంటూ ప్రజలచే ప్రేయర్ చేయంచడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఈ కార్యక్రమంలో ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పాల్గొనడం మరింత వివాదాస్పదంగా మారింది.  దేవుళ్ళు లేరు,హిందూత్వాన్ని నమ్మొద్దు అనే వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  హిందూత్వంపై విషం చిమ్మడం, హిందు దేవుళ్లను అవమానించడం స్వేరోస్ లక్ష్యమా? అంటూ బీజేపీ నాయకులు కన్నం అంజయ్య  ప్రశ్నించారు.