అమ్మా వాసిరెడ్డి పద్మ... పవన్ కు కాదు ఆ మహిళా మంత్రులకు నోటీసులివ్వండి: సుగాలి ప్రీతి తల్లి

Oct 25, 2022, 10:36 AM IST

కర్నూల్ : ఇటీవల జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మహళల రక్షణకు భంగం కలిగించేలా వున్నాయంటూ ఏపీ మహిళా కమీషన్ ఆయనకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కర్నూల్ కు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి స్పందిస్తూ పవన్ కు మద్దతుగా నిలిచారు. మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మకు పలు ప్రశ్నలు స్పందించిన ఆమె ఓ తల్లిగా, బాధితురాలిగా అడుగుతున్నా... సమాధానం చెప్పండని నిలదీసారు. ''అమ్మా... వాసిరెడ్డి పద్మగారు... నేను పార్వతీ దేవి... సుగాలి ప్రీతి తల్లిని. నా కూతురిపై జరిగిన దారుణం, మా కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఎన్నోసార్లు మహిళా కమీషన్ ను ఆశ్రయించాము... మేము ఆధారాలతో సహా అందించిన ఫైల్స్ మూలపడ్డాయి. ఒక్కసారి వాటిని చూసి మాకు న్యాయం చేయాలి. స్కూల్లో జరుగుతున్న ఆకృత్యాల గురించి పేజీలకు పేజీల ఫైల్స్ ఇచ్చా. ఇంతవరకు చర్యలు కాదుగదా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఆ స్కూల్లో అమ్మాయిల మానప్రాణాలకు రక్షణలేదన్నా పట్టించుకోని మీరు పవన్ కల్యాణ్ చెప్పిన రెండు మాటలకే ఆడపిల్లల మానప్రాణాలు పోతున్నాయంటూ నోటీసులు అందింస్తారా. మీరు మహిళా కమీషన్ ఛైర్మన్ గా చేసింది కరెక్టే.... కానీ అంతకంటే ముందు మహిళా హోంమంత్రితో పాటు మరోమంత్రి రోజాపై నోటీసులు ఇవ్వాల్సింది. అత్యాచారాలు తల్లి పెంపకం వల్లేనని... మగాళ్లు మూడ్ వచ్చి రేప్ చేస్తారంటూ పేపర్ స్టేట్ మెంట్ ఇచ్చారు మహిళా హోంమంత్రి. రెండు మూడు రేప్ లకే రాద్దాంతమా అని రోజా అన్నారు. అప్పుడు మీరెందుకు స్పందించలేదు'' అని సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నించారు.