Jul 27, 2020, 3:42 PM IST
రాజస్థాన్ లో బీజేపీ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ రాజ్ భవన్ ముందు నిరసనకు దిగాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజస్థాన్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.