Dec 6, 2019, 12:38 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారని ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులను
దేశవ్యాప్తంగా మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తెగ ట్వీట్లు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు గొప్ప పనిచేశారని వారు ఆ అమ్మాయికి సరైన న్యాయం చేయగలిగారంటూ తమ
సంతోషాన్ని పంచుకుంటున్నారు. వరంగల్ లో 9 నెలల పాపపై జరిగిన అత్యాచారనిందితుడికి పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరి శిక్ష విధించేలా పక్కా ఆధారాల్తోచర్యలు
తీసుకున్నారు కానీ దాన్ని హై కోర్ట్ కొట్టివేస్తూ ఉరి శిక్షను కాస్త యావజ్జీవ శిక్షగా మార్చింది. ఏది ఏమైనా ఈ సంఘటనతో కొన్ని విషయాల్లో న్యాయస్థానాలతో, నాయకులతో ప్రజలకు
న్యాయం జరగదని.. అలాంటి వాటిలో పోలీసులతోనే న్యాయం జరుగుతుందని ప్రజలుభావిస్తున్నారు. తెలంగాణ పోలీసుల పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ
పోలీసులను దేశ ప్రజలు అభినందిస్తున్నారు. ఏదిఏమైనా దేశ ప్రజల్లో తెలంగాణ పోలీసులపట్ల మంచి స్పందన వచ్చింది. తెలంగాణ పోలీసులను చూసి ఇతర పోలీసులు
నేర్చుకోవాలంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.