మేకప్‌లో ఇంటికెళ్లిన శ్రీకాంత్‌ లుక్‌ చూసి అమ్మ రియాక్షన్‌ మైండ్‌ బ్లాక్.. `గేమ్‌ ఛేంజర్‌`లో మేకప్ సీక్రెట్

First Published | Dec 15, 2024, 12:32 AM IST

రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో కీలకపాత్రలో నటించాడు శ్రీకాంత్‌. తాజాగా ఆయన మాట్లాడుతూ మేకప్‌ పడ్డ కష్టం, అమ్మతో మెమొరీని పంచుకున్నాడు శ్రీకాంత్‌. 
 

మ్యాన్లీ స్టార్‌ శ్రీకాంత్‌ ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలతో అలరించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా తను కూడా మారుతున్నాడు. బలమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. నెగటివ్‌ రోల్స్, పాజిటివ్‌ రోల్స్ పాత్ర ఏదైనా స్ట్రాంగ్స్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు. ఇటీవల `దేవర` చిత్రంతో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు `గేమ్‌ ఛేంజర్‌`తో రాబోతున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి శంకర్‌ దర్శకుడు. దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది. 
 

ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా శనివారం మీడియాతో ముచ్చటించిన శ్రీకాంత్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన మేకప్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను బయటపెట్టాడు శ్రీకాంత్‌. తన కెరీర్‌లో మొదటిసారి ఇలాంటి మేకప్‌ ఉన్న పాత్రని పోషించినట్టు తెలిపారు. మొదట కథ చెప్పినప్పుడు నాకెందుకు ఈ రోల్‌ గురించి చెబుతున్నాడని అనుకున్నాడట.

కానీ సెకండాఫ్‌ చెప్పినప్పుడు ఓకే ఈ పాత్రని తాను మాత్రమే చేసేలా ఉందనిపించిందట. ఇందులో సీఎం పాత్రలో కనిపిస్తాడట. అందుకోసం మేకప్‌ తో కొత్త మేకోవర్‌లోకి మారిపోయినట్టు తెలిపారు శ్రీకాంత్‌. 
 

Tap to resize

పెద్దాయనలా లుక్‌ ఉంటుందని, ఆ మేకప్‌ వేసుకోవడానికే నాలుగు గంటలు పట్టేదన్నారు. ఇది తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ అని, సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చిందన్నారు. అయితే ఈ సినిమాలో తన లుక్‌ రిఫరెన్స్ తన తండ్రిదే అని, నాన్న ఎలా ఉంటాడో చూసి తన లుక్‌ని అలా డిజైన్‌ చేశారట.

మేకప్‌ వేసుకున్నప్పుడు ఓ రోజు అలానే ఇంటికి వెళ్లాడట. శ్రీకాంత్‌ని చూసిన వాళ్ల అమ్మ ఒక్కసారిగా షాక్‌ అయ్యిందట. కాసేపటి వరకు ఆమెకి నోటి మాట రాలేదని, ఓ రకంగా టెన్షన్‌ భయం, ఆయోమయం కలిగాయట. ఓ షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపాడు. ఆ తర్వాత దీని గురించి చెప్పినప్పుడు ఆమె సంతోషించిందట. 
 

శంకర్‌ సినిమాలో నటిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇందులో రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. శంకర్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ అని, ప్రతిదీ పర్‌ఫెక్షన్‌తో ఉంటాడని, సినిమాని చాలా బాగా డీల్‌ చేశాడని తెలిపారు. కమర్షియల్‌ అంశాలు మేళవించిన చిత్రమిది అని, పాటలు, ఫైట్లు, కథ, సెంటిమెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి సందేశం కూడా ఉంటుందని,

ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను, సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. `నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా సస్పెన్స్‌లు ఉంటాయి. గెటప్ వేసిన వెంటనే ఆ కారెక్టర్ తాలుకా షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది` అన్నారు శ్రీకాంత్‌. 

Game Changer

``గోవిందుడు అందరివాడేలే` చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు. రామ్ చరణ్ నన్ను ఎప్పుడూ అన్నా అని ఆప్యాయంగానే పిలుస్తాడు. ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి.

ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయన్నారు శ్రీకాంత్‌. తన కొత్త సినిమాల గురించి చెబుతూ సాయి ధరమ్ తేజ్ `సంబరాల ఏటు గట్టు`లో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇలా సినిమాలు, వెబ్‌సిరీస్‌తో అలరిస్తున్నారు శ్రీకాంత్‌.  

read more:`డాకు మహారాజ్` ఫస్ట్ సాంగ్‌ రివ్యూ? సినిమా కూడా ఈ రేంజ్‌లో ఉంటే సంక్రాంతి బాక్సాఫీసుకి పూనకాలే

also read: కీర్తిసురేష్‌ తల్లితో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? విలన్‌గా చేసినా సూపర్‌ హిట్‌
 

Latest Videos

click me!