ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బిజినెస్ ఏంటంటే టీ షాప్. మార్కెట్ లో ఎన్ని టీ దుకాణాలు ఉన్నా కొత్తవి వస్తుండటానికి ఇదే కారణం. మీరు గాని మంచి టేస్ట్, నాణ్యతగా టీ అమ్మితే మీ టీ దుకాణం మారుమూల ఉన్నా కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారు. సాధారణంగా కార్పొరేట్ ఆఫీసులు, మార్కెట్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్ వంటి రద్దీగా ఉంటే చోట్ల టీషాప్ పెడితే రోజుకు రూ.లక్షల్లో ఆదాయం సంపాదించొచ్చు.
ముఖ్యంగా నగరాల్లో టీ దుకాణాలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అక్కడ ఇప్పటికే ఎన్నో టీ షాప్స్ ఉన్నా కొత్తగా పెట్టే వాటిని కూడా కస్టమర్లు ఆదరిస్తారు. ఎందుకంటే కొత్త టేస్ట్ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. పల్లెల్లో కూడా మీరు మంచి టేస్ట్, క్వాలిటీతో టీ సర్వ్ చేయగలిగితే మీ బిజినెస్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది.