Jul 8, 2020, 1:20 PM IST
ములుగు జిల్లా మంగంపేటలో దారుణం చోటుచేసుకుంది. తనతో వాదనకు దిగిన ఓ వ్యక్తిపై ఓ ప్రొక్లెయిన్ డ్రైవర్ దాడికి దిగాడు. ప్రొక్లెయిన్ ముందు ఉండే బకెట్ తో అతన్ని కిందికి నెట్టేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై మంగంపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యక్తి తాగి ఉన్నాడని, తనతో ఇష్టంవచ్చినట్టు వాదనకు దిగడంతో అలా చేశానని డ్రైవర్ చెబుతున్నాడు.