నెలాఖరులో ఫ్రెండ్స్‌ని, కొలీగ్స్‌ ని డబ్బు అడుగుతున్నారా? ఇలా చేస్తే మనీ సమస్య రాదు

First Published | Dec 14, 2024, 1:02 PM IST

జాజ్ చేసే చాలా మందికి నెలాఖరులో మనీ ప్రాబ్లమ్ వస్తుంటుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బు ఉండదు. దీంతో ఫ్రెండ్స్ నో, కొలీగ్స్ నో, రిలేటివ్స్ నో డబ్బులు అడిగి అవసరాలు తీర్చుకుంటారు. కానీ జాగ్రత్తగా ఖర్చు చేస్తే ప్రతి నెలాఖరులో డబ్బు సమస్య రాకుండా చూసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం రండి. 

జాబ్ చేసే వాళ్లందరూ జీతం మీదే ఆధారపడి జీవిస్తుంటారు. కనీసం పాల ప్యాకెట్ కొనాలన్నా జీతం డబ్బుల్లోంచే ఖర్చు పెట్టాలి. అందుకే ఉద్యోగులు లెక్కగా ఖర్చులు చేస్తుంటారు. రోజువారీ అవసరాల కోసం ఒక ప్లానింగ్ ప్రకారం ఖర్చు చేస్తుంటారు. అంటే పాలు, ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, కూరగాయలు, కిరాణా వస్తువులు.. ఇలా ప్రతి దానికి ముందుగానే బడ్జెట్ కేటాయిస్తారు. ఈ లెక్క ఎక్కడ తప్పినా ఆ ఎఫెక్ట్ వచ్చే నెల జీతంపైన కూడా పడుతుంది.  

ఫంక్షన్లకు వెళ్లాల్సి రావడం, చుట్టాలు ఇంటికి రావడం, పుట్టిన రోజు, పెళ్లి రోజు, సినిమాలు ఇలాంటి వాటి వల్ల ప్రతి నెల బడ్జెట్ తప్పుతూనే ఉంటుంది. అందుకే నెలాఖరు వచ్చే సరికి రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ ఖర్చులను భరించడానికి చాలామంది స్నేహితులు, సహ ఉద్యోగులు, బంధువుల నుండి అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ప్లానింగ్ మిస్ కాకుండా చేస్తే నెలాఖరులో డబ్బు సమస్య రాకుండా చూసుకోవచ్చు. 

Tap to resize

ఈ టిప్స్ పాటిస్తే డబ్బు సమస్య రాదు..

ప్రతి నెల కరెంట్ బిల్లు, మొబైల్ రీఛార్జ్, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా ఖర్చు, ఇతర రోజువారీ అవసరాలకు సంబంధించిన ఖర్చులు తీర్చక తప్పదు. వీటి కోసం ముందుగానే డబ్బు కేటాయించాలి.

బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొనడం వంటివి మానుకుంటే మంచిది. దీనివల్ల డబ్బు సమస్యను నివారించవచ్చు.

ప్రతి నెల అత్యవసర అవసరాల కోసం కొంత డబ్బు పక్కన పెట్టాలి. దీనివల్ల ఏ సమయంలోనైనా అత్యవసర అవసరానికి డబ్బు ఉంటుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. 

ప్రతి నెలా అవసరమైన, అనవసరమైన ఖర్చులు, అత్యవసర ఖర్చుల లిస్టు తయారు చేసుకోవాలి. ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చుపెట్టాలి. ఏ ఖర్చు చేయకుండా ఉంటే మంచిదో మీకు ఆ లిస్టు చూడగానే అర్థమవుతుంది. 

ఆరోగ్య సమస్యలు ఎప్పుడొస్తాయో ఎవరూ చెప్పలేరు. అందువల్ల ఇలాంటి అత్యవసర అవసరాల కోసం కొంత డబ్బు దాచుకోవడం అలవాటుగా చేసుకోవాలి. లేకపోతే అవసరమైనప్పుడు ఇతరులను సహాయం అడగాల్సి వస్తుంది. ఇది మీకు అన్ని విధాలుగా నష్టం కలిగిస్తుంది. 

ఎవరైనా డబ్బు సాయం అడిగినప్పుడు తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటేనే డబ్బు ఇవ్వండి. లేకపోతే మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది. 

అనవసర షాపింగ్ లు, ప్రయాణాలు తగ్గించుకోండి. వీటి వల్ల ఆనందం కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. కాని ఖర్చు చేసిన డబ్బు తిరిగి సేవ్ చేయడానికి చాలా నెలలు పడుతుంది. అనవసర ఖర్చులు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. 

Latest Videos

click me!