చలికాలంలో ఇలా చేస్తే.. తెల్ల జుట్టు రాదు

First Published | Dec 14, 2024, 1:26 PM IST

తెల్ల జుట్టు ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. నిజానికి తెల్ల వెంట్రుకల వల్ల అందం తగ్గుతుంది. పెద్దవారిలా కూడా కనిపిస్తారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం తెల్ల వెంట్రుకలు రావడం తగ్గుతుంది. 

చలికాలంలో శరీర ఆరోగ్యమే కాదు.. జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ సీజన్ లో చాలా మంది జుట్టును సరిగ్గా చూసుకోరు. దీనివల్ల జుట్టు తెల్లగా మారడం స్టార్ట్ అవుతుంది. ఈ తెల్ల జుట్టువల్ల మీరు పెద్దవయసు వారిలా కనిపించడం మొదలుపెడతారు. అలాగే మీ అందం కూడా తగ్గుతుంది. అయితే చలికాలంలో కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం తెల్లజుట్టు రావడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వీటివల్ల మీ జుట్టు రాలడం తగ్గుతుంది. అందంగా మెరుస్తుంది. ఎందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఎండ, చలి నుంచి రక్షణ 

తెల్ల జుట్టు రాకూడదంటే ఎండనుంచి మాత్రమే కాదు చలి నుంచి కూడా మీ జుట్టును రక్షించాలి. చాలా మంది చలికాలంలో చలిపెడుతుందని చాలా సేపు ఎండలో కూర్చుంటుంటారు. కానీ సూర్యరశ్మి ప్రభావం వల్ల మీ వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతాయి.

అందుకే చలికాలంలో ఎండలో ఎక్కువ సేపు ఉండకూడదు. కానీ కొద్దిసేపు ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా నెత్తికి టోపీ పెట్టండి. లేదా స్కార్ఫ్ ను వాడండి. 

Tap to resize

జుట్టుకు పోషణ 

జుట్టు తెల్లగా కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో జుట్టుకు సరైన పోషణ లేకపోవడం కూడా ఉంది. మీకు తెల్ల వెంట్రుకలు రావొద్దంటే మాత్రం సరైన పోషకాహారం తీసుకోండి.

అలాగే మీ జుట్టుకు పోషణను అందించడానికి నూనెతో మసాజ్ చేయండి. మసాజ్ కోసం మీరు బాదం లేదా ఉసిరి, కొబ్బరి నూనెను ఉపయోగించండి. నెత్తికి ఆయిల్ తో మసాజ్ చేసిన రెండు లేదా గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. మర్చిపోకుండా కండీషనర్ ను కూడా వాడండి. 
 

 ఒకవేళ మీకు తెల్ల వెంట్రుకలు ఉంటే గనుక నేచురల్ హెయిర్ మాస్క్ ను ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే ఈ హెయిర్ మాస్క్ లను ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు మంచి పోషణ అందుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది.

అయితే ఈ నేచురల్ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి నిపుణుల సహాయం అవసరం. ముఖ్యంగా ఈ నేచురల్ హెయిర్ మాస్క్ వాడే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల మీ జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. 

Latest Videos

click me!