గుంజపడుగు ఎస్బిఐ దొంగలు మహారాష్ట్రవైపు వెళ్లారా?: పోలీస్ విచారణ వేగవంతం

Mar 26, 2021, 7:26 PM IST

పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బిఐ బ్యాంక్ చోరీ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులు బ్యాంక్ ను సందర్శించి వివరాల సేకరించారు. అయితే గ్యాస్ సీలిండర్ పైన నెంబర్ ను కూడా చేరిపివేసిన దొంగలు ఎక్కడా కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. చోరీ అనంతరం దొంగలు మహారాష్ట్ర వైపు వెళ్లారా? అనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గుంజపడుగు నుండి గోదావరిఖని, మంథని వరకు ఉన్న సీసీ పుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.