Mar 24, 2021, 2:39 PM IST
ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు,ఇంటి ముందున్న వాహానాలు ఎత్తుకెళ్ళడం సాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ఇటివల పెట్రోల్ రేటు వందకి దగ్గరగా ఉండి డిమాండ్ ఉండడంతో కొందరు గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో ఇండ్ల ముందు నిలిపిఉన్న ద్విచక్ర వాహానంలోని పెట్రోల్ ని మాయం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా రాత్రి పూట ఇంటిముందు నిలిపిఉన్న పదుల సంఖ్యలో వాహానాల లోని పెట్రోలు ఖాళీ అవుతుండడంతో ఇంటి ముందు ఉన్న సిసి పుటేజిలని పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి ఇంటిముందు నిలిపిఉన్న వాహానాల పైపు ఊడదీసి క్యాన్ లో దర్జాగా పట్టుకెళ్ళుతున్నారు. గత రెండు రోజులలోనే పదుల సంఖ్యల వాహానాలలో పెట్రోల్ తీసుకెళ్ళారు.