Feb 15, 2021, 12:25 PM IST
కరీంనగర్: వాహనదారుల భద్రత కోసం ''నో హెల్మెట్ - నో పెట్రోలు'' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగిత్యాల జిల్లా అధికారులు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే జిల్లాలోని బంకుల యజమానులు, సిబ్బందితో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు బంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ నిబంధనలు అతిక్రమించే బంకు యజమానులు, వాహన చోదకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అమలులోకి వచ్చింది... కాబట్టి వాహనదారులు హెల్మెట్ ధరించి మాత్రమే పెట్రోల్ బంకులకు రావాలని సూచించారు. లేదంటే పెట్రోల్ విక్రయించరని అధికారులు తెలిపారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలోను నివారించేందుకు ఇలా కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.