ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్ లు వాడుతున్నారు. అయితే ఎక్కువసేపు వాటి స్క్రీన్ చూడటం కళ్లకు అంతమంచిది కాదు అంటున్నారు నిపుణులు. బ్లూ లైట్ ఎక్కువగా కంటిపై పడటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. కళ్లు మసకబారడం, పొడిబారడం, కళ్ల కింద నల్లగా మారడం, తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి.