
బీర్ ను చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. కొంతమంది అయితే ఏకంగా వారానికి ఒకసారైనా బీర్ ను తాగుతుంటారు. అయితే బీర్ తాగడానికి మాత్రమే కాదు ఇంటిని పనులను కూడా దీనితో చేయొచ్చు తెలుసా? అవును సోఫాలను క్లీన్ చేయడం నుంచి మొక్కలకు ఎరువుగా ఉపయోగించడం వరకు బీర్ ను ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. అసలు బీర్ ను ఉపయోగించి ఎలాంటి పనులు చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బీర్ తో ఎలాంటి పనులు చేయొచ్చు?
ఫర్నీచర్ పాలిషింగ్
ప్రతి ఒక్కరి ఇంట్లో ఫర్నీచర్లు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ ఫర్నీచర్లు కొన్ని రోజులకు కొత్తదనాన్ని కోల్పోయి.. పాత వాటిలా దుమ్ము, ధూళితో కనిపిస్తాయి. అయితే దీన్ని మీరు చాలా సింపుల్ గా ఫర్నీచర్ ను క్లీన్ చేయొచ్చు. కొత్తదానిలా మెరిసేలా చేయొచ్చు. ఇందుకోసం దీనిపై కొంచెం బీరు చల్లి గుడ్డతో తుడవాలి. దీంతో ఫర్నీచర్ కు అంటుకున్న మురికి మొత్తం పోయి ఫర్నీచర్ కొత్తదానిలా మెరుస్తుంది.
మొక్కలకు ఎరువు
వినడానికి వింతగా ఉన్నా.. బీర్ మొక్కలకు మంచి ఎరువు తెలుసా? అవును.. బీర్ ను మెక్కలకు చల్లితే అవి బాగా పెరుగుతాయి. ఎందుకంటే బీర్ మొక్కల్లోని ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది. మొక్క బాగా ఎదగడానికి సహాయపడుతుంది.
నగలు మెరిసిపోతాయి
బీర్ ను ఉపయోగించి మనం ధరించే బంగారు నగలను క్లీన్ చేయొచ్చు. బీర్ తో నగలను క్లీన్ చేయడం వల్ల వాటికి పట్టుకున్న మురికి మొత్తం పోతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నెలో కొంచెం బీరు పోసి నగలను అందులో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టండి. దీంతో మీ బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరిసిపోతాయి.
తెగుళ్ల నివారణ
చాలా మందికి తోటలో లేదా గడ్డిలో కూర్చొని తినడమంటే చాలా ఇష్టం. కానీ గడ్డిపై కూర్చొని తింటే కీటకాలు, ఈగలు ఫుడ్ పై వాలుతుంటాయి. అయితే మీరు ఫుడ్ చుట్టూ అంటే గడ్డిలో బీర్ ను చల్లితే ఒక్క ఈగ, పురుగులు అస్సలు రావు.
తుప్పు మరకలు పోతాయి
ఇనుప వస్తువులు చాలా తొందరగా తుప్పు పడుతుంటాయి. కానీ ఈ తుప్పును అంత సులువుగా తొలగించలేం. కానీ బీర్ తో తుప్పు మరకలను చాలా సులువుగా తొలగించొచ్చు. ఇందుకోసం బీర్ ను తుప్పుకు రాస్తే ఇట్టే తొలగిపోతుంది.
పొడి పాదాలు
బీర్ ను మన పాదాలను అందంగా చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. ముఖ్యంగా పొడి పాదాలున్న వారికి బీర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పాదాలు గనుక గరుకుగా ఉంటే ఒక బకెట్లో ఒక లీటరు వెనిగర్ ను వేసి అందులో రెండు సీసాల బీర్ వేసి మీ పాదాలను అరగంట పాటు నానబెట్టండి. దీంతో మీ పాదాలు సాఫ్ట్ గా అవుతాయి.
బీర్ షాంపూ
బీర్ ను మనం షాంపూగా కూడా ఉపయోగించొచ్చు. అవును బీర్ ను తలకు రాసుకుంటే మీ వెంట్రుకలు అందంగా మెరుస్తాయి. చాలా స్టోర్లల్లో బీర్ షాంపూ దొరుకుతుంది. దీన్ని ఎలాంటి భయం లేకుండా ఉపయోగించొచ్చు.