4. మార్కుల వెంట పరిగెత్తకండి
పిల్లల మార్కులే వారి విలువను నిర్ణయించవు. తల్లిదండ్రులు పిల్లలను మార్కుల ఆధారంగానే చూస్తారు. మంచి తండ్రి పిల్లల నిజమైన విజయం వారి కష్టంలో, ప్రవర్తనలో ఉందని గుర్తిస్తాడు. పిల్లల విలువ మార్కుల్లో కాదు, వారి ప్రయత్నంలో ఉందని నేర్పించాలి.
5. తండ్రి ఆదర్శంగా నిలవాలి
తండ్రి పిల్లలకు మొదటి హీరో. తండ్రిని చూసి పిల్లలు పెద్ద కలలు కంటారు. తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు ఆదర్శంగా, ప్రేరణగా నిలవాలి. దీనివల్ల పిల్లలు తండ్రిలా ఉండాలని కలలుకంటారు, వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.
6. భావోద్వేగ స్థిరత్వం, భద్రత కల్పించడం (తండ్రులు భావోద్వేగ స్థిరత్వం, ప్రేమ, మద్దతు ఇస్తారు)
తండ్రి పిల్లలకు భావోద్వేగ స్థిరత్వం, భద్రత కల్పిస్తాడు. తండ్రి తోడు, మద్దతు, ప్రేమ పిల్లలకు జీవిత సమస్యలు, భావోద్వేగాలు ఎదుర్కోవడానికి తోడ్పడతాయి. తండ్రి ప్రేమ, మద్దతుతో ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలమని, కుటుంబం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందని పిల్లలు నేర్చుకుంటారు.