థర్డ్ డిగ్రీ టార్చర్... ఆ పోలీసులను శిక్షించేలా చూడండి : రేవంత్ తో నేరెళ్ల బాధితులు

Mar 4, 2023, 12:25 PM IST

కరీంనగర్ :తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి తమ బాధను వ్యక్తంచేసారు నేరెళ్ల బాధితులు.ఇసుక అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన తమను పోలీసులు చితకబాదారని... థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు రేవంత్ కు తెలిపారు. పోలీసుల టార్చర్ ఇప్పటికీ మరిచిపోకలేకపోతున్నామని... ఆ బాధను ఇప్పటికీ అనుభవిస్తున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా తమను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకునేలా చూడాలంటూ రేవంత్ ను కోరారు. రేవంత్ కూడా నేరేళ్ల బాధితులతో అన్ని వివరాలు అడిగి తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చాడు.